‘ఖలేజా’ సునామి.. కేవలం బుకింగ్స్ తోనే మరో రికార్డు!

సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రాల్లో “ఖలేజా” కూడా ఒకటి. అయితే ఇది అప్పట్లో అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేదు కానీ ఇపుడు మాత్రం సునామి సృష్టిస్తోంది అని చెప్పాలి. ఒక్క మహేష్ బాబు అభిమానుల్లోనే కాకుండా అందరిలో కూడా ఈ సినిమాకి యూనానిమస్ పాజిటివ్ రీచ్ ఉంది. ఇప్పుడు ఇదే భారీ ప్లస్ అయ్యింది అని చెప్పాలి.

అన్నేళ్ల తర్వాత రీరిలీజ్ కి వస్తున్నా ఖలేజా చిత్రం బుకింగ్స్ ఆరంభం అయ్యిన మొదటి రోజు నుంచే సాలిడ్ నంబర్స్ సెట్ చేసింది. ఇక రిలీజ్ కి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే అప్పుడే 4 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుకొని కొత్త రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో రీరిలీజ్ లలో మాత్రం ఖలేజా డే 1 కి భారీ రికార్డు సెట్ చేసేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించగా మణిశర్మ ఇచ్చిన పాటలు, నేపథ్య గీతం కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Exit mobile version