సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన రెండో సినిమా “ఖలేజా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇన్నేళ్ల తర్వాత రీరిలీజ్ కి భారీ క్రేజ్ నడుమ వచ్చింది. ఇలా రావడంతోనే అనకాపల్లి నుంచి అమెరికా వరకు కూడా ఖలేజా విధ్వంసం సృష్టించింది అని చెప్పడంలో సందేహం లేదు.
మహేష్ బాబుకి ఎంతో స్ట్రాంగ్ జోన్ అయ్యిన యూఎస్ మార్కెట్ లో అయితే లెక్కలు ఊహించని నంబర్స్ తో మొదలయ్యాయి. యూఎస్ లో ఏకంగా 80 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు ఈ చిత్రం అందుకొని ఆల్ టైం రికార్డ్స్ లో మొదలైనట్టుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. మొత్తానికి మాత్రం ఖలేజా ఒక సంచలనంగా మారేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా సి కళ్యాణ్, సింగనమల రమేష్ బాబులు నిర్మాణం వహించారు.
Idhi nee darshanam… Idhi nidarshanam ????????????????????????
This is what we rooted for. This is what we fought for.⁰And this… made us the TAGLINE – ALL TIME RECORD RE RELEASE GROSSER in the USA ❤️❤️
Thank you Super Fans. It was long overdue…⁰BUT WE’RE BACK WITH THE MASSIEST BANG! ????????… pic.twitter.com/tAREYizk7C
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 30, 2025