“కేజీయఫ్ 2” టీజర్ సెన్సేషన్..మరో మైల్ స్టోన్.!

“కేజీయఫ్ 2” టీజర్ సెన్సేషన్..మరో మైల్ స్టోన్.!

Published on Jan 15, 2021 9:00 AM IST

మొత్తం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను మళ్ళీ షేక్ చేసేందుకు రెడీ అవుతున్న పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి గత కొన్ని రోజుల కితం విడుదలైన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో దుమ్ము లేపేసింది.

ఇండియన్ సినిమాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఈ టీజర్ పలు ఫాస్టెస్ట్ రికార్డులను నెలకొల్పింది.మరి అలాగే అక్కడ నుంచి ఎన్నో మైల్ స్టోన్స్ ను అందుకుంటూ వస్తున్న ఈ టీజర్ లేటెస్ట్ గా 150 మిలియన్ సెన్సేషనల్ వ్యూస్ మైల్ స్టోన్ ను అందుకుంది.

అంతే కాకుండా 7.5 మిలియన్ లైక్స్ ను కూడా టచ్ చేసి చరిత్ర సృష్టించింది. మొత్తానికి మాత్రం యష్ మరియు ప్రశాంత్ నీల్ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఇది జస్ట్ శాంపిల్ అని చెప్పాలి. మరి ఇక ముందు నుంచి వచ్చే ట్రైలర్ సినిమాలకు ఏ స్థాయి రెస్పాన్స్ ఉంటుందో ఊహాతీతమే అని చెప్పాలి.

https://twitter.com/prashanth_neel/status/1349771047164284929?s=20

తాజా వార్తలు