ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పుడు ‘కెజిఎఫ్ 2’ సొంతం


ఏదైనా పెద్ద సినిమా టీజర్, ట్రైలర్ వచ్చింది అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ పడ్డాయి అనేది తప్పకుండా గమనిస్తుంటారు ప్రేక్షకులు. ఇప్పటివరకు ఈ టీజర్, ట్రైలర్ రికార్డులు రజినీకాంత్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, విజయ్, మహేష్ బాబు లాంటి హీరోల పేరు మీద, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాల పేరుతో ఉండేవి. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ ‘కెజిఎఫ్ 2’ టీజర్ అధిగమించేసింది. 2021 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ఈ సినిమా టీజర్ నిన్న రాత్రి 9:29 గంటలకు విడుదలైంది.

అనుకున్న సమయానికంటే ముందే టీజర్ వచ్చేయడంతో అంతా సప్రైజ్ ఫీలయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎగబడి టీజర్ ను వీక్షించారు. టీజర్లోని యాక్షన్ షాట్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూశారు. దీంతో టీజర్ 24 గంటలు కూడ గడవకముందే 69 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు 4.2 మిలియన్ లైక్స్ దక్కించుకుంది. ఈ రికార్డులు చూస్తే సినిమా మీద హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ 2021 ప్రథమార్థంలోనే రిలీజ్ కానుంది. ఇందులో యష్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటించగా రవీనా టాండన్ రమికాసేన్ పాత్రలో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపిస్తున్నారు.

Exit mobile version