ఆ తరహా సబ్జెక్ట్స్ అంటే భయపడుతున్న కీర్తి సురేష్?

ఆ తరహా సబ్జెక్ట్స్ అంటే భయపడుతున్న కీర్తి సురేష్?

Published on Nov 8, 2020 1:09 PM IST

మహానటి తరువాత కీర్తి సురేష్ ఫేమ్ డబుల్ అయ్యింది. ఆ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా మేకర్స్ కీర్తి సురేష్ ని భావిస్తున్నారు. దీనితో వరుసగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితం పెంగ్విన్ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయడం జరిగింది. తాజాగా కీర్తి నటించిన మిస్ ఇండియా మూవీ కూడా విడుదల అయ్యింది. ఓటిటి లో విడుదలైన ఈ రెండు చిత్రాలు సరైన ఆదరణ దక్కించుకోలేదు.

నగేష్ కుకునూర్ దర్శకత్వంలో గుడ్ లక్ సఖి అనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతుంది. ఐతే రెండు వరుస పరాజయాలను చూసిన కీర్తి ఈ తరహా సబ్జక్ట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనలో ఉన్నారట. ఇకపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయకూడని డిసైడ్ అయ్యారట. ఆ తరహా సబ్జక్ట్స్ తో ఆమెను అప్రోచ్ అయ్యే దర్శక నిర్మాతలకు నో చెప్పేస్తున్నారని సమాచారం.

మరో వైపు కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటించిన రంగ్ దే త్వరలో విడుదల కానుంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ హీరోగా దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్న సర్కారు వారి పాట మూవీలో కూడా కీర్తి హీరోయిన్ గా ఎంపికయ్యారు.

తాజా వార్తలు