నిఖిల్, స్వాతి జంటగా ప్రస్తుతం ‘కార్తికేయ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుంది. ఈ సినిమా వైజాగ్ లో సెట్ వేసిన ఒక గుడి చుట్టూ తిరుగుతూ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాతో చందు మొండేటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నాడు. బి.వి శ్రీనివాస్ నిర్మాత
‘స్వామి రారా’ సినిమాతో విజయాన్ని అందుకున్న నిఖిల్, స్వాతిల జంట మరోసారి ఈ సినిమాతో మ్యాజిక్ చెయ్యడానికి సిద్ధంగా వున్నారు.