కార్తి నటించిన ‘బిర్యాని’ సినిమా సెప్టెంబర్ 6న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమాలో కార్తి సరసన హన్సిక నటిస్తుంది. ప్రేమ్ జీ, మాండీ థాకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో చాల భాగాన్ని హైదరాబాద్ మరియు చెన్నైలలో తీసారు. ‘శకుని’, ‘బాడ్ బాయ్’ సినిమాలు పరాజయంకావడంతో ఈ సినిమా కార్తికు ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. ఒక రాత్రి బిర్యానీ కోసం బయటకు వెళ్ళిన వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాలను యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ విధానంలో తెరకెక్కించారు. వెంకట్ ప్రభు ఇప్పటికే ‘చెన్నై – 28’, ‘సరోజ’ ‘గోవా’ మరియు ‘మంకత్త’ వంటి సినిమాలను తీసాడు. ‘మంకత్త’ సినిమా తెలుగులో ‘గ్యంబ్లర్’గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కార్తి మరి తెలుగులో తన పరాజయాల బాటనుండి బయటపడతాడేమో చూడాలి.