‘స్వామి రారా’ సినిమా సక్సెస్ తర్వాత యంగ్ హీరో నిఖిల్, స్వాతి కలిసి నటిస్తున్న సినిమా ‘కార్తికేయ’. థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రొడక్షన్ టీం చెప్పిన దాని ప్రకారం మరో రెండు, మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
చందూ మొండేటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ఆయన వర్క్ చూసి మెచ్చుకుంటున్నారు. అతన్ని మెచ్చుకున్న వారిలో ఎస్ఎస్ రాజమౌళి కోడా ఒకరు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, సిజి షాట్స్ ఎక్కువగా ఉండనున్నాయి. స్వామి రారా సినిమా మంచి సక్సెస్ కావడం వల్ల ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది. కార్తికేయ ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.