హిందీలో ‘కాంతారా 1’ సాలిడ్ ఓపెనింగ్స్ తో మొదలు!

హిందీలో ‘కాంతారా 1’ సాలిడ్ ఓపెనింగ్స్ తో మొదలు!

Published on Oct 3, 2025 11:01 PM IST

Kantara Chapter 1

కన్నడ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన సాలిడ్ డివోషనల్ చిత్రమే “కాంతార 1”. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే మొదటి రోజు భారీ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. మరి ఇలా హిందీ మార్కెట్ పై కూడా గట్టిగానే కన్నేసిన ఈ సినిమా అక్కడ సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా బాలీవుడ్ పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.

దీనితో కాంతార 1 నార్త్ బెల్ట్ లో 18.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ వీకెండ్ లో లెక్కలు మరింత ఎక్కువ వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. మరి గతంలో వచ్చిన సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు