అక్కడ ‘కన్నప్ప’ టికెట్ బుకింగ్స్ షురూ.. డే1 టార్గెట్ వంద కోట్లు..?

టాలీవుడ్ హీర మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా చేస్తున్నారు మేకర్స్. ఇక విష్ణు ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్, బిగ్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం నుంచి అమెరికాలో ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. అందరూ ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రం ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ప్రీమియం-ఫార్మాట్ ఆడిటోరియం (IMAX, స్క్రీన్ X మరియు 4DXతో సహా)లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ఓవర్సీస్‌లో 1,100పైగా స్క్రీన్లు, 200లకు పైగా యూస్ ప్రీమియర్ లను ప్లాన్ చేశారు.

భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ‘కన్నప్ప’ చిత్రం ఓపెనింగ్ డేకి రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. వంద కోట్లతో డే వన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని తెలుస్తోంది. కన్నప్పలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ నటించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version