కొంతకాలం క్రితం, ముస్లింలు మరియు హిందువుల మధ్య జరిగిన ఢిల్లీ అల్లర్లలో కంగనా మరియు ఆమె సోదరి రంగోలి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆమె పై వారి పై కేసు కూడా నమోదైంది. కంగనా పై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడినప్పటికీ, ఆ కేసు పై కంగనా కూడా లీగల్ గా మూవ్ అయింది. ఇప్పుడు, మరోసారి ఈ కేసుకు సంబంధించి ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కాగా కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి పై ఎటువంటి బలవంతపు చర్యలకు వద్దు అంటూ బొంబాయి హైకోర్టు సోమవారం నుండి జనవరి 25 వరకు ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు వీరిద్దరిని ప్రశ్నించడానికి పిలవవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
కంగనా ప్రస్తుతం తమిళ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో దివంగత నేత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో జయలలిత పాత్రలో నటిస్తోంది, ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది.