ఓటిటి సమీక్ష: ‘కరీముల్లా బిర్యానీ పాయింట్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

kancharapalem-raju-kareemul

విడుదల తేదీ : నవంబర్ 27, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కంచరపాలెం రాజు, శివన్నారాయణ, కేదార్ శంకర్
దర్శకులు : ప్రభు చంద్
నిర్మాత : ఉదయ్ సద్దల
సంగీతం : ఆదిత్య బిఎన్
సినిమాటోగ్రఫీ : కళ్యాణ్ కుమార్ పి
ఎడిటింగ్ : ప్రతీక్ నూతి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రతీ వారం తీసుకొస్తున్న కథా సుధా లఘు చిత్రాల్లో ఈ వారం వచ్చిన కొత్త సినిమానే ‘కరీముల్లా బిర్యానీ పాయింట్'(). మరి ఈ ఫన్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

గోవింద్ (కంచరపాలెం రాజు) అలాగే తన స్నేహితురాలు, ప్రేమించిన ఆమె మేరీ కోసం ఆమె చివరి రోజుల్లో తన పుట్టినరోజుకి ఆమెకి గుర్తుండే ట్రీట్ ఇవ్వాలని ఆమెకి ఎంతో ఇష్టమైన కరీముల్లా బిర్యానీ అది కూడా నూతక్కిలో ఉన్న బిర్యానీ 50 ఏళ్ళు ముందు షాప్ నుంచి తెచ్చి ఇవ్వాలని భావిస్తాడు. ఇందుకు కొంతమొత్తం డబ్బులు అవసరం అవుతాయి. మరి ఈ డబ్బులు కోసం తన స్నేహితులు సుభాని (శివన్నారాయణ) అలాగే ఈమాన్ (కేదార్ శంకర్) లతో కలిసి ఆ డబ్బులు సంపాదించడానికి రెడీ అవుతారు. అందుకు వారు చేసిన ప్రయత్నాలు ఏంటి? అందులో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి గోవింద్ మేరీకి తాను అనుకున్న బిర్యానీ అందించి ఆమె కళ్ళలో ఆనందం చూసాడా అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో బాగా ఇంప్రెస్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే ఒక ఫ్రెష్ నెస్ ఇందులో కనిపిస్తుంది. రొటీన్ అంశాలకి కొంచెం దూరంగా మంచి ఫన్ అండ్ డీసెంట్ ఎమోషన్స్ తో ఈ చిత్రం సాగడం అనేది చూసే వీక్షకులకు ఒకింత ఆహ్లాదంగా అనిపిస్తుంది.
అంతే కాకుండా ఒక తరుణ్ భాస్కర్, దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాల్లో ఒక నాచురాలిటీ ఎలాగైతే కనిపిస్తుందో అంతే నాచురాలిటీ మరియు హానెస్టీ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. సహజసిద్ధమైన పరిస్థితులు సింపుల్ గానే ఉన్నప్పటికీ మంచి ఫన్ మూమెంట్స్ వీక్షకుల్లో మంచి ఫీల్ ని కలుగజేస్తాయి.
ఇక ముగ్గురు సీనియర్ నటులు కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ రాజు, నటుడు శివన్నారాయణ, కేదార్ శంకర్ లు ముగ్గురు పాత్రలు ఆ పాత్రల్లో ముగ్గురు కూడా పర్ఫెక్ట్ పెర్ఫామెన్స్ లని అందించారు. తమ వయస్సు, ఆయా పాత్రల్లో ఎలాంటి ఎమోషన్స్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలి అనేది చాలా బాగా చేశారు.
మెయిన్ గా నటుడు శివన్నారాయణ, కేదార్ శంకర్ ల మధ్య ఫన్ మూమెంట్స్ భలే అనిపిస్తాయి. ఇక ముగ్గురు ఫ్రెండ్స్ తమ ఓల్డేజ్ టైం లో చేసే చిన్నపాటి ఫన్, అడ్వెంచర్ లు అందులో డీసెంట్ ఎమోషన్స్, కొన్ని ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో చాలా వరకు కథనం బాగానే ఉంది కానీ దానిని నడిపించిన విధానం మాత్రం స్లోగా ఉందని చెప్పాలి. ఎడిటింగ్ లో ఇంకొంచెం ఫాస్ట్ పేస్ లో నడిపించి ఉంటే బాగుండేది. ఇక దీనితో పాటుగా కొన్ని లాజిక్స్ ని కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎంత లేదు అనుకున్నా ఒక కుటుంబంలో పెద్దల దగ్గర కనీసం 200 కూడా ఉండవా అనిపిస్తుంది. అలాగే కంచరపాలెం రాజు లవ్ ట్రాక్ ఇంకొంచెం యాడ్ చేసి మరింత ప్లెజెంట్ ఎండింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దాదాపు అవుట్ డోర్ లోనే షూటింగ్ చేసిన విజువల్స్ అంతా బాగున్నాయి. ఆదిత్య బి ఎన్ ఇచ్చిన సంగీతం ఫ్రెష్ గా సినిమాలో సన్నివేశాలకి మంచి ఫ్లేవర్ ఇచ్చింది. ఒక రకంగా వివేక్ సాగర్ టచ్ లో అనిపిస్తుంది. ప్రతీక్ నూతి ఎడిటింగ్ బాగానే ఉంది కానీ కొంచెం ఫాస్ట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు ప్రభు చంద్ ఇచ్చిన వర్క్ మాత్రం చాలా బాగుంది. డీసెంట్ లైన్ ని బాగా రాసుకొని పాత్రలు డెవలప్మెంట్ అంతే క్లారిటీగా చేశారు. అలానే మూడు మతాలని ముగ్గురు ఫ్రెండ్స్ కి కలిపి మంచి ట్రాక్ ని తాను సెట్ చేసుకొని ఫన్ అడ్వెంచర్ ని నడపడం బాగుంది. తన నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా పడితే ఎలా ఉంటుందో చూడాలి. కాకపోతే ఇందులో కథనం కొంచెం స్పీడప్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘కరీముల్లా బిర్యానీ పాయింట్’ ఒక డీసెంట్ గా సాగే ఫన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ముగ్గురు సీనియర్ ఫ్రెండ్స్ చేసే చిన్నపాటి అడ్వెంచర్ అందులో మంచి ఫన్ ఇంకా ఎమోషన్ బాగుంది. దర్శకుడు విజన్, ప్లానింగ్ నీట్ గా ఉన్నాయి. కాకపోతే కథనం ఇంకొంచెం బాగా నడిపించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం మంచి ట్రీట్ ని అందిస్తుంది. సో ఈటీవీ విన్ లో దీనిని చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version