కమల్ హసన్ దగ్గర తన కోరికను బయటపెట్టిన నయనతార

నయనతార తెలుగు పరిశ్రమలో పలు విజయాలతో పాటు పలు విమర్శలు ఎదుర్కున్న కథానాయిక. నయనతార ఎప్పుడు తన పై ఉన్న విమర్శలకు స్పందించలేదు.అలానే అభిమానులకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. కాని బాపు గారి “శ్రీ రామరాజ్యం” చిత్రం తరువాత ఆమెలో చాలా కనిపిస్తుంది. పలు ఈవెంట్లలో ఆమె కనిపిస్తుంది ఫ్యాన్స్ మరియు పాత్రికేయులతో ఆమె కలుస్తున్నారు ఈ మధ్యనే ఆమె కమల్ హసన్ ని కలిసి ఆయనతో నటించాలనే కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. జై, ఆర్య మరియు నయనతార ప్రధాన పాత్రలలో వస్తున్న “రాజ రాణి” చిత్ర లాంచ్ లో జరిగింది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె చాలా సేపు కమల్ హసన్ తో మాట్లాడింది ఆమె కోరికను కమల్ తీరుస్తాడో లేదో వేచి చూడాలి. త్వరలో నయనతార “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రంలో కనిపించనుంది.

Exit mobile version