ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ అత్యధికంగా సెన్సార్ బోర్డు నుండి అత్యధిక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి ఎన్ని సార్లు చిత్ర పరిశ్రమ వర్గాలు వినతి పత్రాన్ని సమర్పించిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో నిర్మాతలు తమ సినిమాని సెన్సార్ బోర్డుకి పంపాలంటే భయపడుతున్నారు.
ఇదే సెన్సార్ బోర్డు సమస్యని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముందు ఉంచితే ఆయన సమాధానమిస్తూ ‘ సెన్సార్ బోర్డు పనితీరు సరిగా లేకపోతే పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అది సరిగ్గా ఉండాలి అంటే అర్హులైన వారే సెన్సార్ బోర్డు లో ఉండాలి. మాములుగా సినిమాలు ఇష్టపడే వాళ్ళు సెన్సార్ బోర్డులో ఉంటారు. అలాఅని వారందరూ అనుభవజ్ఞులైన వారని చెప్పలేం. అక్కడ అర్హులైన వాళ్ళు ఉంటేనే సినిమాకి న్యాయం జరుగుతుంది. ఈ మధ్య ప్రతి రాజకీయ పార్టీలు తమకు సంబందించిన ఓ వ్యక్తి సెన్సార్ బోర్డులో ఉండాలనుకుంటోంది. అది చాలా తప్పు. సెన్సార్ షిప్ బాధ్యతని చిత్ర పరిశ్రమ తెసుకుంటేనే మంచి జరుగుతుందని’ ఆయన అన్నారు.