కమల్ షాకింగ్ కామెంట్స్.. కన్నడ అభిమానులు ఆగ్రహం!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “థగ్ లైఫ్”. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండగా లేటెస్ట్ గా ఇదే సినిమా ప్రమోషన్స్ లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరు కావడం జరిగింది.

అయితే ఈ నేపథ్యంలోనే కన్నడ భాష కూడా తమిళ్ నుంచే పుట్టింది అని కమల్ చెప్పడం షాకింగ్ గా మారింది. శివ రాజ్ కుమార్ కూడా తన ఫ్యామిలీనే అని ఎందుకంటే కన్నడ భాష కూడా తమిళ్ నుంచే పుట్టుకొచ్చింది అని అందుకే తాను అలా అన్నాను అంటూ ఆ ఈవెంట్ లో చెప్పడం ఇపుడు కమల్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలే కర్ణాటక వాసులకి భాష మీద ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వీటిపై వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి తమ ఏకంగా తమది కాదు అనే రేంజ్ లో కమల్ చేసిన కామెంట్స్ ఇపుడు షాకింగ్ గా మారాయి. మరి ఇది రిలీజ్ పై ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా లేక కమల్ హాసన్ ఏమన్నా వివరణ ఇస్తారా అనేది చూడాలి.

Exit mobile version