కమల్ మరో బోల్డ్ స్టేట్మెంట్.. శివరాజ్ కుమార్ పై విమర్శలు!

కమల్ మరో బోల్డ్ స్టేట్మెంట్.. శివరాజ్ కుమార్ పై విమర్శలు!

Published on May 31, 2025 9:01 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష, అభిరామి ఫీమేల్ లీడ్ లో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “థగ్ లైఫ్”. అయితే ఈ చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తున్న సమయంలోనే ఊహించని విధంగా పలు కాంట్రవర్సీలు రేగాయి. మెయిన్ గా కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుంచే పుట్టింది అని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది.

ఇక దీని తర్వాత కమల్ హాసన్ తాను అన్న దానిలో ఎలాంటి తప్పు లేదని నేను క్షమాపణ చెప్పేది లేదని తనని కన్నడలో బ్యాన్ చేసినా సరే చెప్పనని, నేను తప్పు అయితే ఖచ్చితంగా చెప్తాను అని మళ్ళీ బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం వైరల్ గా మారగా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ఈ సినిమా ఈవెంట్ కి హాజరయ్యాక ఇచ్చిన స్టేట్మెంట్ మరింత షాకింగ్ గా మారింది.

కమల్ ని తనకి తండ్రి సమానులు అని మాట్లాడ్డం అటుంచితే తిరిగి కన్నడ ప్రేక్షకులనే నాన్ కన్నడ సినిమాలు మీరు చూడట్లేదా అంటూ అవమానించేలా మాట్లాడుతున్నారని వారు శివ రాజ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నారు. దీనితో ఈ అంశం మరింత రసవత్తరంగా మారుతుంది. మరి రిలీజ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు