‘కల్కి’ నటికి తప్పని ఇక్కట్లు.. కొత్త వివాదంలోకి

deepika-padukone

బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ దీపికా పదుకోణ్ కూడా ఒకరు. అయితే బాలీవుడ్ లో ఆమె ఎంతో స్టార్ అయ్యి ఉండొచ్చు కానీ తన కండిషన్స్ వగైరా మాత్రం మన సైడ్ సెట్ కాకపోవడంతో ఉన్న అవకాశాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల భారీ చిత్రాలు కల్కి 2898 ఎడి ఇంకా స్పిరిట్ చిత్రాల విషయంలో ఎలాంటి వివాదాలు ఆమె చుట్టూ తిరిగాయి అనేది అందరికీ తెలిసిందే.

ఇవి ఇంకా పచ్చి గానే ఉన్నాయి అనే సమయంలో కొత్త వివాదంలో దీపికా పదుకోణ్ పేరు మళ్ళీ వైరల్ అవుతుంది. ఇటీవల ఆమె తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి అబుదాబి టూరిజం కోసం చేసిన డ్రెస్సింగ్ విషయంలో ఈ వివాదం అంతా చోటు చేసుకుంటుంది. భారతదేశంలో అయితే దేవాలయాలకి వెళ్ళినపుడు కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదు కానీ ఎక్కడో బయట సంప్రదాయాలు మాత్రం పాటిస్తుంది అని నార్త్ జనమే ఇపుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సరికొత్త వివాదంపై కూడా దీపికా స్పందిస్తుందేమో అనేది చూడాలి.

Exit mobile version