తుపాకి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న కాజల్


ఎ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో అందాల భామ కాజల్ అగర్వాల్ బాక్సర్ పాత్ర చేసిన ‘తుపాకి’ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో కాజల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ మూవీ రెండవ వారం కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ తుపాకి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మేము పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని’ అంది.

కాజల్ ప్రస్తుతం తెలుగులో ‘సారొచ్చారు’, ‘నాయక్’ మరియు ‘బాద్షా’ సినిమాల్లో నటిస్తోంది, అలాగే బోల్ల్య్వవోడ్లో తన రెండవ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.

Exit mobile version