“అర్జున్ రెడ్డి” రీమేక్ లో ఉన్నాడని నటుడికి అవమానం

“అర్జున్ రెడ్డి” రీమేక్ లో ఉన్నాడని నటుడికి అవమానం

Published on Feb 26, 2025 9:00 AM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా డైనమిక్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “అర్జున్ రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇదే చిత్రాన్ని తను హిందీలో షాహిద్ కపూర్ అలాగే కియార అద్వానితో చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

అయితే అనూహ్యంగా ఈ సినిమాలో నటించాడు అని చెప్పి ఓ నటుడిని బాలీవుడ్ లో ఓ ప్రముఖ బడా నిర్మాణ సంస్థ ఆ నటుడుని తమ సినిమాలో తీసుకునేందుకు నిరాకరించారు అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

ఆ నటుడు పేరు బ్యానర్ పేరు చెప్పలేదు కానీ ఆ సదరు నటుడు ఆ బ్యానర్ లో ఓ సినిమా ఆడిషన్ కోసం వెళితే ఊహించని విధంగా వారు అతన్ని నువ్ కబీర్ సింగ్ లో ఉన్నావ్ కదా మేము నిన్ను తీసుకోవడం లేదు అని చెప్పి పంపేసారట. దీనితో సందీప్ వంగ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అలాగే ఆ నటుడు ఎవరు, ఆ బ్యానర్ ఏంటి అనేది కూడా హిందీ ఆడియెన్స్ లో ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు