
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సె, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాంత’ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12, 2025 నుండి ‘కాంత’ సినిమాను ప్రసారం చేయాలని నెట్ఫ్లిక్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగు మరియు ఇతర భారతీయ భాషలలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఐతే, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
కాగా ఈ సినిమాకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు, పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్, భాగ్యశ్రీల పర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కాప్ రోల్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ప్రొడ్యూస్ చేశారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.