జ్యోతిక సిన్సియారిటీ అట్రాక్ట్ చేసింది – సూర్య

జ్యోతిక సిన్సియారిటీ అట్రాక్ట్ చేసింది – సూర్య

Published on Sep 1, 2013 11:00 AM IST

Surya
తమిళ్ సూపర్ స్టార్ సూర్యది మామూలుగా కాస్త సిగ్గుపడే మనస్తత్వం, ఇదే విషయాన్ని ఆయన చాలా సార్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సూర్య ఒక వ్యక్తిగా, సినిమాల విషయంలో బాగా హ్యాపీ గా ఉన్నాడు. ఇటీవలే సూర్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్యోతికలో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏమిటి అని అడిగితే సూర్య సమాధానం చెబుతూ ‘ నేను 1999లో తను తొలి సినిమా ద్వారా పరిచయం అవుతున్నప్పుడు కలిసాను. ఆ తర్వాత తను చాలా పెద్ద స్టార్ అయ్యింది, తన సిన్సియారిటీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆమె ముంబై నుంచి వచ్చింది తమిళ్ రాకపోయినా ఎంతో శ్రద్దగా నేర్చుకునేది, అలాగే ఎప్పుడు పదాలు కష్టంగా ఉన్నాయని ఫీల్ అయ్యేది కాదు. తనకి ఎలాంటి ఈగో ఉండదు, తను తన అసిస్టెంట్స్ ని ట్రీట్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. తను నాకు లైఫ్ గురించి చాలా నేర్పింది. ముఖ్యంగా ఒక తండ్రి ఎలా ఉండాలో చెప్పిందని’ అన్నాడు.

అలాగే సూర్య మాట్లాడుతూ ‘ 2006లో మా పెళ్లి నిర్ణయం కూడా తనే తీసుకుంది. అలాగే తను సినిమాలకు దూరం కాదం కూడా తన నిర్ణయమే. తను తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అందరినీ ఆనందంగా ఉంచుతాయని’ చెప్పాడు.

తాజా వార్తలు