“ఛావా” కోసం ఎన్టీఆర్ ఎంతవరకు నిజం?

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాని షేక్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా “ఛావా” అనే చెప్పాలి. శంబాజీ మహరాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ సినిమా ఒక్క హిందీలోనే రిలీజ్ అయినప్పటికీ భారీ రెస్పాన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో అందుకుంది.

అయితే తెలుగు ఆడియెన్స్ లో కూడా నెక్స్ట్ లెవెళ్లోకి వెళ్లగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయాలని ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డబ్బింగ్ కోసమే ఓ క్రేజీ రూమర్ ఇపుడు వైరల్ గా మారింది. తెలుగు డబ్బింగ్ ఇంకా అసలు కన్ఫర్మే కాలేదు కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డబ్బింగ్ అందించనున్నారు పలు రూమర్స్ ఆల్రెడీ మొదలయ్యాయి.

అయితే చిత్ర యూనిట్ నుంచి ఇంకా తెలుగు డబ్బింగ్ విషయంలో ఎలాంటి మూమెంట్ లేదు. సో ఎన్టీఆర్ డబ్బింగ్ అందిస్తున్నాడు అనే మాటల్లో కూడా ప్రస్తుతానికి వాస్తవం లేదు. కానీ ఒకవేళ అందిస్తే మాత్రం ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అవైటెడ్ సినిమా విషయంలో ఏమవుతుందో చూడాలి.

Exit mobile version