ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : నవంబర్ 16, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఝాన్సీ, చరణ్ పేరి, భాను తేజ తదితరులు
దర్శకుడు : యొహిత్ రెడ్డి
నిర్మాత : ఉదయ్ సద్దాల
సంగీతం : ఆదిత్య బి ఎన్
ఛాయాగ్రహణం : నాగేశ్వర్ వడ్డే
కూర్పు : సుశ్రుత్ చిలకపాటి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈటీవీ విన్ లేటెస్ట్ లఘు చిత్రమే ఈగో. తమ వీక్లీ సిరీస్ కథా సుధలో కొత్త ఎపిసోడ్ గా వచ్చిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
సరక్క (ఝాన్సీ) అనే ఒక లేడీ డాన్ తనకి చిన్నపుడు స్కూల్ లో జరిగిన ఒక అవమానం, తనని అవమానించిన ఆ వ్యక్తి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. కానీ అతడు అమెరికాలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికే వెళ్లి తన పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. కానీ ఆమెకి తన గ్యాంగ్ రౌడీలకి అక్కడికి వెళ్లాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. మరి ఆ ఇంగ్లీష్ వారెలా నేర్చుకున్నారు? సరక్క ఎందుకు అంత పగ పెంచుకుంది? తన రివెంజ్ ఆమె తీర్చుకుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో పాయింట్ గత లఘు చిత్రాలతో పోలిస్తే కొంచెం రిఫ్రెషింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఆ క్లీన్ కామెడీ, పరిస్థితులకి తగ్గట్టుగా వచ్చే కొన్ని కొన్ని వన్ లైనర్ కామెడీ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. అలాగే ఝాన్సీ తన గ్యాంగ్ పై నడిచే ఫన్ మూమెంట్స్ బాగున్నాయి.
వారి ఇంగ్లీస్జ్ క్లాస్ నేర్చుకునే సన్నివేశాలు వాటిలో సహజంగా వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే ఝాన్సీ తన రోల్ లో ఫిట్ అయ్యారు. తన ఎక్స్ పీరీయన్స్ సరక్క అనే పాత్రలో చూపించి తన రోల్ ని ఫుల్ ఫిల్ చేశారు. అలాగే యువ నటుడు ఇటీవల శుభం నటుడు చరణ్ పేరి తన రోల్ లో బాగా చేసాడు.
మొరటు మనుషులకి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఇబ్బంది పడే కుర్రాడిగా మంచి ఫన్ సిచువేషన్స్ లో కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే వీరితో పాటుగా ఝాన్సీ వర్గంలో కనిపించే నటులు తమ పాత్రలు చాలా నాచురల్ గా చేసి ఇంప్రెస్ చేశారు. అలాగే దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశాన్ని కూడా బానే ఇచ్చే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా చాలా సింపుల్ గా వెళ్లిపోతుంది. మంచి బలమైన కథలు సీరియస్ కథనాలు లాంటివి అలాగే గట్టి ఎమోషనల్ మూమెంట్స్ లాంటి వాటిని కోరుకునేవారు అయితే ఈ లఘు చిత్రం విషయంలో కొంచెం డిజప్పాయింట్ అవుతారు.
అలానే ఇందులో ఒక టీం అంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా మరీ కొత్తదేమీ కాదు ఈ మధ్య వచ్చిన కీడా కోలా లో సీన్స్ గుర్తు వస్తాయి. ఒకవేళ అది చూడని వారికి అయితే మరింత ఫన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంచెం స్లోగా సాగే కథనం కూడా అలా సోసో ఫీల్స్ కలిగిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆదిత్య బి ఎన్ సంగీతం బాగుంది. కెమెరా వర్క్ నాచురల్ గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు కానీ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. ఇక ఈ సినిమా దర్శకుడు యొహిత్ రెడ్డి విషయానికి వస్తే.. తాను ఒక క్లీన్ కామెడీ ఫ్లిక్ ని డీసెంట్ మెసేజ్ తో ప్లాన్ చేసుకొని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది బాగానే ఉంది. కొన్ని సీన్స్ మంచి ఫన్ గా నాచురల్ గా సాగాయి. కాకపోతే ఇంకా మంచి కామెడీ సీన్స్ ని పెట్టి ఉంటే హిలేరియస్ గా వర్కౌట్ అయ్యి ఉండేది. సో ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే మరింత బెటర్ గా అవుట్ పుట్ తన నుంచి వచ్చి ఉండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ లఘు చిత్రం ‘ఈగో’ (ఎడ్యుకేషన్ గోస్ ఆన్) ఒక అక్కడక్కడా మంచి ఫన్ తో సాగే కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్పొచ్చు. ఝాన్సీ అండ్ గ్యాంగ్ అలాగే చరణ్ కూడా బాగానే చేసాడు. కానీ ఇందులో కథనం ఇంకా హిలేరియస్ గా మరింత బెటర్ సీన్స్ తో ప్లాన్ చేసి ఉంటే మరింత బాగుండేది. చిన్న ఫ్లాస్ పక్కన పెట్టి ఒక సింపుల్ గా వెళ్లిపోయే నీట్ కామెడీ డ్రామా చూడాలి అంటే దీనిని చూడొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


