భ్రమ చుట్టూ తిరిగే జగమే మాయ

భ్రమ చుట్టూ తిరిగే జగమే మాయ

Published on Sep 1, 2013 12:00 PM IST

Jagame-Maaya
టాలీవుడ్ లో ‘జగమే మాయ’ అనే టైటిల్ తో ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి టైటిల్స్ పెట్టాలంటే కాస్త డేరింగ్ ఉండాలి. ఇటీవలే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఈ మధ్య కాలంలో వచ్చిన అన్నిటికంటే కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం కూడా ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ కథాంశం మొత్తం భ్రమ అనే అంశం చుట్టూ తిరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రపంచమే ఒక భ్రమ అని చెప్పాలనుకుంటున్నారు. చాలా కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుందని డైరెక్టర్ మహేష్ ఉప్పుటూరి అన్నాడు. శివ బాలాజీ, సిధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత.

తాజా వార్తలు