అలా మొదలైంది దర్శకురాలు నందిని రెడ్డి రెండవ ప్రయత్నం ‘జబర్దస్త్’ విడుదలకు సిద్ధమవుతోంది. సిద్ధార్థ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్య మీనన్ ప్రత్యేక పాత్రలో నటించింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల చేయనున్నారు. మొదటి సినిమా అలా మొదలైందితో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న నందిని రెడ్డి ఈ సినిమా కూడా అధ్బుతంగా రూపొందించిందని సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఎకౌంటులో పేర్కొన్నాడు. జబర్దస్త్ సినిమా చూశానని నందిని రెడ్డి తనకి మర్చిపోలేని సినిమా ఇచ్చిందని అన్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.