మన టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తన తదుపరి చిత్రంగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో “గాడ్సే” మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సి.కె. స్క్రీన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంతకు ముందే “బ్లఫ్ మాస్టర్” వంటి క్లాసిక్ మూవీ తర్వాత సత్యదేవ్, గోపిగణేష్ పట్టాభి యాక్షన్ ప్యాక్‌డ్ థ్రిల్లర్ ‘గాడ్సే`తో మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నారు.పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవ్వడానికి రెడీ అవుతుంది.
తెలుగులో అరంగేట్రం చేయడానికి ఇది సరైన చిత్రం అని ఆమె నమ్ముతుంది.ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్‌లో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే పాత్రలో నటిస్తోంది.గోపిగణేష్ పట్టాభి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌నుఅందిస్తున్న ఈ చిత్రానికి సి.వి. రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక అలాగే ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిషోర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.