ఇంటర్వ్యూ : దర్శకుడు శ్రీనివాస్ మన్నె – ‘ఈషా’ ప్రేక్షకులను భయపెడుతూనే అలరిస్తుంది..!

Srinivas-Manne

ప్రముఖ హీరోయిన్ జెనీలియా లీడ్ రోల్‌లో నటించిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె. ఆయన కొంత విరామం తరువాత రూపొందించిన లేటెస్ట్ చిత్రం ‘ఈషా’. లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె పాత్రికేయులతో ముచ్చటించారు.

కథ చిత్రం తరువాత ఇంత విరామం తీసుకోవడానికి రీజన్ ఏమిటి?

కథ చిత్రానికి నాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రానికి ఉత్తమనటనకు జెనీలియాకు నంది అవార్డు కూడా వచ్చింది. కథ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా మంచి ప్రశంసలు వచ్చాయి. అనుకోకుండా నా వ్యక్తిగత కారణాల వల్ల దర్శకత్వానికి గ్యాప్‌ వచ్చింది. దామోదర్‌ ప్రసాద్‌ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో ఈ సినిమా చేశాను.

ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ థ్రిల్లర్స్‌తో పోలిస్తే ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఏమిటి?

హారర్‌తో పాటు మన జీవితాల్లో ఉన్న చావులు పుట్టుకలు, అండర్‌ కరెంట్‌లో దైవత్వం, సృష్టి చేసే పనులు ఇలా అన్ని అంశాలు ఉంటాయి. సృష్టి అన్నింటిని బ్యాలెన్స్‌ చేస్తుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలను టచ్ చేశాం. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండే సినిమా ఇది.

ఈ సినిమా చూసి అందరూ భయపడతారు అంటున్నారు ఎందుకని?

సినిమాలో చాలా షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. వాంటెడ్ గా ఉండదు. సినిమా చూసి భయపడతారు అంతే. హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడకూడదు. సెన్సార్ వాళ్లు చూసి సినిమా చాలా భయంకరంగా ఉంది.. గుడ్‌ కంటెంట్‌ అన్నారు.

ఈ సినిమా విజయంపై మీకున్న నమ్మకం ఏమిటి?

హారర్‌ సినిమాకు ప్రత్యేక ఆడియన్స్‌ ఉంటారు. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే విధానంపై మాకు నమ్మకం ఉంది.

మీ తదుపరి చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి?

నాకు అన్ని తరహా చిత్రాలు చేయాలని ఉంది. కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

Exit mobile version