ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై హైప్ ఊహించని లెవెల్లో ఉంది. మరి ఈ హైప్ లోనే తెలుగు స్టేట్స్ లో ముందే ప్రీమియర్స్ పడే ఛాన్స్ ఉందని స్ట్రాంగ్ బజ్ బయటకి వచ్చింది. కానీ ఇప్పుడు దీనిపై ఓ కొత్త టర్న్ వినిపిస్తుంది.
దీనితో ఓజి కి ముందు రోజు అంటే సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ ఉండబోవని తెలుస్తుంది. కానీ 25 అర్ధ రాత్రి తర్వాత ఉదయం 1 గంట షోస్ అలాగే ఉదయం 4 గంటల షోస్ ఉంటాయని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఫార్మాట్ లో ఉంటాయని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.