శ్రీలీల నుంచి గుడ్ న్యూస్ రూమర్స్ నిజమేనా!?

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్స్ లో శ్రీలీల కూడా కనిపిస్తుంది. అయితే శ్రీలీల హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇలా ఇపుడుకి కూడా చేతిలో అనేక సినిమాలు ఆమె పెట్టుకోగా తన నుంచి ఇన్ని రోజులు సినిమా వార్తలే కాకుండా ఇపుడు కొంచెం భిన్నంగా ఆమె పర్శనల్ లైఫ్ కి సంబంధించి గుడ్ న్యూస్ ఏమన్నా వస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

రీసెంట్ గా ఆమె షేర్ చేసుకున్న ఇన్స్టా స్టోరీ ఫొటోస్ చూసి అంతా ఆమెకి పెళ్లి నిశ్చయం అయ్యింది అని భావిస్తున్నారు. అయితే ఆ పిక్స్ లో కోలాహలం, పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. పైగా శ్రీలీల ‘త్వరలోనే’ అంటూ మరో హింట్ ఇవ్వడంతో మరింత సస్పెన్స్ నెలకొంది. మరి ఆమె పెళ్లే అంటూ పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఈ గుడ్ న్యూస్ పై ఆమె నుంచే ఇంకా అసలైన క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version