రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా దూసుకువెళుతుంది. ముషీరాబాద్ ఫారెస్ట్ ఏరియాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ నందు ఓ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ నందు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ కి హీరోయిన్ గా అలియా నటిస్తుంది. ఐతే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి అలియా పై ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట. బాహుబలి చిత్రంతో తమన్నా పై వచ్చే ధీరవరా.. సాంగ్ మాదిరి ఓ అద్భుత విజువల్ వండర్ గా ఈ పాట ఉంటుందని సమాచారం. కేవలం అలియా మాత్రమే ఈ సాంగ్ నందు నటిస్తారట. అలియా పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె కొరకు రాజమౌళి ఇలా ఓ స్పెషల్ సాంగ్ రూపొందించారని తెలుస్తుంది. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.