ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన చిత్రం “స్పిరిట్” కూడా ఒకటి. ఒక రకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ సినిమా కోసం చాలా మంది ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇంకా ఖరారు కావాల్సి ఉండగా ఈ సినిమా విషయంలో కొన్నాళ్ల కితం ఒక మెగా సర్ప్రైజ్ ఉన్నట్టుగా రూమర్స్ వచ్చాయి.
అదే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని వచ్చిన టాక్ సెన్సేషన్ గా మారింది. అయితే అప్పుడు ఈ టాక్ కేవలం గాసిప్స్ అన్నట్టే అనుకున్నారు కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అది నిజమే అని తెలుస్తుంది. మెగాస్టార్ ఈ సినిమాలో ప్రభాస్ కి తండ్రి పాత్రలోనే కనిపిస్తారని ఇప్పుడు స్ట్రాంగ్ బజ్. దీనిపై మాత్రం అఫీషియల్ క్లారిటీ వస్తే.. ఇదొక బ్లాస్టింగ్ కాంబినేషన్ అవుతుంది అని చెప్పాలి.