పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా రానా దగ్గుబాటి విలన్ రోల్ లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రాలు బాహుబలి 1, 2 లు కలిపి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో లానే బాహుబలి మళ్లీ భారీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో వచ్చింది.
అందుకు తగ్గట్లుగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకి దక్కాయి. అయితే రీరిలీజ్ లలో ఈ సినిమా ఈజీగా 100 కోట్ల మార్క్ కొడుతుంది అని చాలా మంది భావించారు కానీ క్రమంగా సినిమా వసూళ్లు డ్రాప్ అవుతూ రావడం అనేది కనిపిస్తుంది. దీనితో ట్రేడ్ వర్గాల్లో 100 కోట్ల మార్క్ కష్టమే అన్నట్లు ఇప్పుడు టాక్.
అయితే 50 కోట్ల దగ్గర లేదా ఆపై వసూళ్లు చేసే ఛాన్స్ మాత్రం ఈ సినిమాకు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని మేజర్ సిటీస్ అండ్ పాపులర్ స్క్రీన్స్ వరకు మాత్రం ఇంకో వారం పాటు సాలిడ్ బుకింగ్స్ ఈ సినిమాకి నమోదు కావడం విశేషం.
