ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని ఊహించని పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందే తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ ని మూసేస్తున్నారు అనే వార్త షాకింగ్ గా మారింది. అయితే హరిహర వీరమల్లు సినిమాని ఎఫెక్ట్ చేయడానికే ఇది అంటూ ఓ వెర్షన్ వైరల్ గా మారింది కానీ ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ బయటకి వచ్చింది.
మెయిన్ గా ఈ జూన్ నెల లోనే ఉన్న బిగ్ రిలీజ్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ బంద్ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది అనే మాట పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యింది. అయితే దీనిపై లేటెస్ట్ నిర్మాత దిల్ రాజు నుంచి క్లారిటీ వచ్చేసింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేసిన కామెంట్స్ తో దిల్ రాజు గారు ఎలాంటి బంద్ ఉండదని తేల్చేశారని చెప్పారు.
కళ్యాణ్ గారి సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఈ బంద్ తర్వాతికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అని తెలిపారు. సో హరిహర వీరమల్లుకి అయితే లైన్ క్లియర్ అయ్యినట్టే వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.