కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ఇంటింటా అన్నమయ్య” చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కావచ్చింది. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంతో రేవంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. అనన్య మరియు సనం శెట్టి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అన్నమయ్య కథ అందరికి తెలిసినప్పటికీ ఈ చిత్రాన్ని విభిన్నంగా తెరకెక్కించనున్నారని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అని నిర్మాత తెలిపారు.
నవంబర్ 2 నుండి 24 వరకు అరకులో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం కోసం అరకులో ప్రత్యేకంగా 35 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ చిత్ర రెండవ షెడ్యూల్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 15 వరకు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. చిత్రంలో టాకీ ప్రధాన భాగం మరియు ఆరు పాటలు పూర్తయ్యాయి. ఉమేర్జి అనురాధ ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.