రవితేజ, కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

రవితేజ, కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Oct 4, 2025 12:04 AM IST

Mass-Jathara

మాస్ మహారాజ రవితేజ సినిమాలు ఎలాంటి స్పీడ్ తో పూర్తి చేస్తారో అందరికీ తెలిసిందే. సమయం వృధా చేయకుండా ఒక దాని తర్వాత మరో సినిమా చేస్తూనే వెళ్తారు. అలా లేటెస్ట్ గా రవితేజ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం మాస్ జాతర ఇంకా రిలీజ్ కి రాకుండానే ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన సినిమాని కూడా దాదాపు పూర్తి చేసేసారు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం అట.

మాస్ జాతర తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమలతో ఓ సినిమా అనౌన్స్ చేయడం ఇపుడు ఆ సినిమా ఆల్రెడీ 90 శాతం పూర్తయిపోయినట్టు ఇపుడు తెలుస్తుంది. దీనితో మాస్ మహారాజ్ స్పీడ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి కేవలం ఓ సాంగ్ ఇంకొన్ని సీన్స్ మాత్రమే బాకీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆన్ టైం తీసుకొచ్చేస్తారని చెప్పవచ్చు.

తాజా వార్తలు