మురుగదాస్ ‘మదరాసి’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

కోలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ అలాగే టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ కలయికలో చేస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘మదరాసి’ కూడా ఒకటి. అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ లతోనే తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ లో కూడా సాలిడ్ బజ్ ని సొంతం చేసుకుంది. మరి ఇలా తెరక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం మేకర్స్ ఒక క్రేజీ క్లైమాక్స్ సీక్వెన్స్ తో ఫైనల్ షెడ్యూల్ ని ముగించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ షెడ్యూల్ శ్రీలంకలో ప్లాన్ చేశారట. మరి మురుగదాస్ ‘తుపాకీ’ విలన్ విద్యుత్ జమ్వల్, శివ కార్తికేయన్ నడుమ ఈ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్ ని మురుగదాస్ తెరకెక్కించారట. మొత్తానికి మాత్రం సికందర్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పెద్దగా మురుగదాస్ కి కనిపించడం లేదు. మరి చూడాలి మదరాసి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుంది అనేది.

Exit mobile version