అక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని నిలదొక్కుకొవాలని అఖిల్ ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది.
ఈ సినిమా టైటిల్ ఏమిటనేది రేపు సాయంత్రం 5:15 గంటలకు రివీల్ చేయనున్నారు టీమ్. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.