బిగ్ బాస్ 4 లో నలుగురు క్రేజీ హీరోయిన్స్.?

కరోనా సంగతి ఎలా ఉన్న.. బిగ్ షో పై క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జునకు బదులు ఆయన కోడలు సమంత హోస్ట్ గా చేయనుందని ప్రచారం జరుగుతుంది. కాగా మరో క్రేజీ న్యూస్ బిగ్ సీజన్ 4 గురించి బయటికి వచ్చింది. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో క్రేజీ హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి. హీరోయిన్ శ్రద్దా దాస్, యామినీ భాస్కర్, ప్రియా వడ్లమాణి, హంసా నందిని వంటి నలుగురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించనున్నారట.

వీలైనంత తొందరగా బిగ్ బాస్ సీజన్ 4 మొదలుపెట్టాలని నిర్వాహకులు భావిస్తుండగా.. దీనిపై కసరత్తు చేస్తున్నారట నిర్వాహకులు. దానిలో భాగంగా… ఈ నలుగురు హీరోయిన్స్ ని కూడా సంప్రదించారని సమాచారం. ఐతే గత సీజన్ లోనే శ్రద్దా దాస్ పాల్గొంటారని వార్తలు రాగా ఆమె ఖండించారు. కాబట్టి ఈ వార్తను గట్టిగా నమ్మలేము.

Exit mobile version