ఇంట్రెస్టింగ్ గాసిప్ – చరణ్ లైనప్ లో ఈ టాప్ టాలెంటెడ్ దర్శకుడు.!

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ రెదను సినిమాలు తర్వాత ఏ దర్శకుడికి ఓకే చెప్పాడు? ఎవరితో చేస్తున్నాడు అన్నది మాతరం చరణ్ ఫ్యాన్స్ దృష్టిలో ఇంకా మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే చరణ్ లైనప్ లో ఇప్పటికే చాలా మంది టాప్ దర్శకులు పేర్లు ఉన్నాయని గాసిప్స్ వినిపించాయి.

కానీ ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో టాప్ అండ్ టాలెంటెడ్ దర్శకుని పేరు వినిపిస్తుంది. అతడే కోలీవుడ్ కు చెందిన లోకేష్ కనగ్ రాజ్. “ఖైదీ” మరియు “మాస్టర్” సినిమాలతో మన దగ్గర కూడా మంచి నోటెడ్ అయిన ఈ దర్శకుడు చరణ్ కు ఓ లైన్ వినిపించినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందో లేదో అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మరి ఈ కాంబో సెట్టైతే మాస్ లో రచ్చ గట్టిగానే ఉంటుంది అని చెప్పాలి.

Exit mobile version