పూరి ‘జనగణమన’ బ్యాక్ డ్రాప్ అదేనా?

దర్శకుడు పూరి జగన్నాధ్…చాలా కాలంగా జనగణమన తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పట్లో మహేష్ హీరోగా ఆ మూవీ దాదాపు ఖాయం అయ్యిందని వార్తలు రావడం జరిగింది. కారణాలేమైనా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా ఈ చిత్రం తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతుందని ఆయన పెద్ద చర్చకు తెరదీశారు. అలాగే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.

కాగా పేట్రియాటిక్ సబ్జెక్టు తో తెరకెక్కనున్న ఈ మూవీ బ్యాక్ డ్రాప్ పై ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఈ మూవీని పూరి ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నాడట. ఈ మూవీలో హీరో ఆర్మీ జవానుగా కనిపిస్తాడని సదరు వార్తల సారాంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా..మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version