పారిశ్రామికవేత్త మరియు రాజకీయనాయకుడైన పాలెం శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. ‘మ్యూజిక్ మ్యాజిక్’ పేరుతొ శ్రీకాంత్ రెడ్డి పార్లేడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నిర్మించనున్నారు. ఈ సినిమా ఆడియోను ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసారు. డి. ఎస్ మంత్రాస్కర్ దర్శకుడిగా పరిచయమవ్వడమే కాక మరికొంతమంది నటులను పరిచయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “సంగీతమంటే ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి వుంటుంది. మేము క్లాసికల్ మ్యూజిక్ ని ఎంచుకున్నాము. దీనికోసం ఎంతో రీసెర్చ్ చేసాము. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నానని” తెలిపారు
శ్రీకాంత్ రెడ్డి కడప నియోజికవర్గంలో టి.డి.పి తరుపున గత ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేసారు. సినీ ప్రపంచంలో ఈయన గమ్యం ఎటువైపో త్వరలోనే చూద్దాం