ఇంద్రగంటి మోహన్ కృష్ణ మనకు టాలెంట్ వున్న డైరెక్టర్ గా సుపరిచితుడే. ఆయన మన ముందుకు కొన్ని గుర్తుండిపోయే సినిమాలతో వచ్చినా కమర్షియల్ హిట్ ను అందుకోవడంలో అవి దోహదపడలేదు. 2011లో వచ్చిన ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా అతని ఆఖరి చిత్రం. దాదాపు రెండేళ్ళ విరామం తరువాత ఆయన ‘అంతకుముందు ఆ తరువాత’ అనే రొమాంటిక్ చిత్రంతో మనల్ని పలకరించబోతున్నాడు.
ఈ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధంగావుంది. మోహన్ కృష్ణ ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమా కలెక్షన్లపరంగా కూడా మంచి స్పందనను సంతరించుకుంటే ఈ టాలెంట్ డైరెక్టర్ కెరీర్ సాఫీగా సాగడానికి దోహదపడుతుంది.
ప్రముఖ ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరో. ఈషా హీరోయిన్. పెళ్ళయిన తరువాత అబ్బాయి, అమ్మాయి నడుమ బంధాలు ఎలా వుంటాయనే అంశంమీద ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. కె. దామోదర్ ప్రసాద్ నిర్మాత. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. పి.జి విందా సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టారు