గత మూడు వారాల క్రితం భారత బోర్డర్ లో పాకిస్తాన్ సైనికులు చేసిన దారుణ ఘటనతో ఇండో – పాక్ బస్ సర్వీసును నిలిపివేశారు. తిరిగి మళ్ళీ ఈ రోజే జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా ద్వారా ఇండో పాక్ బస్ సర్వీసును ప్రారంబించారు. లైన్ అఫ్ కంట్రోల్ అనే ట్రేడ్ ని ఉపయోగించుకుని పూంచ్ జిల్లాలోని చక్కన్ ద బాఘ్ గేటు ద్వారా పూంచ్ – రావ్లకోటే బస్ సర్వీసు మొదలైంది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ నుండి ఇండియాకి వచ్చిన 84 రెగ్యులర్ ప్రయాణికులు ఈ రోజు తిరిగి వారి ఇళ్ళకు చేరుకున్నారు. అలాగే ఇండియా నుంచి తమ బంధువులను కలుసుకోవడానికి వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయిన 68 మంది ఇండియన్స్ ఈ రోజు సాయంత్రానికి తమ ఇళ్ళకు చేరుకోనున్నారు.