షూటింగ్ ప్రారంభమైన ఇలియానా సినిమా

ileana

అందాలనటి ​ఇలియానా డైరెక్టర్ రాజ్, డికే సినిమాలో నటించనుందని గతంలో తెలియజేయడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో ఇలియానా సైఫ్ అలీఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ ‘హ్యాపీ ఎండింగ్’. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ పై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రికరించానున్నారని సమాచారం. ఇది ఇలియానాకి రెండవ హిందీ సినిమా. ఫటా పోస్టర్ నిక్ల హీరోగా నటించిన సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్దంగా ఉంది. ​

Exit mobile version