టాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా ‘బర్ఫి’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కావడమే కాకుండా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఇలియానా షాహిద్ కపూర్ తో చేసిన ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’ త్వరలోనే విడుదల కానుంది. అది కాకుండా ఆమె ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ – వరుణ్ ధావన్ సినిమాలో నటిస్తోంది. ఒక్క బ్యూటీ మాత్రమే ఆఫర్లు తెచ్చి పెట్టదని చెబుతోంది ఈ గోవా బ్యూటీ. ‘నాకు అవకాశాలు మాత్రమె కావాలనుకొని ఉంటే నేను బర్ఫి లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చే దాన్ని కాదు, కానీ గ్లామర్ కంటే ముందు నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి అందుకే ఆ సినిమా చేసానని’ ఇలియానా అంటోంది.
ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తోంది. ‘ నాకు బాలీవుడ్ ఖాన్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో నటించాలని ఉంది, అలాగే హృతిక్ రోషన్ తో కూడా నటించాలని ఉంది. కచ్చితంగా వాళ్ళతో నటించే రోజు త్వరలోనే వస్తుందని’ ఇలియానా ఎంతో నమ్మకంగా ఉంది.
టాలీవుడ్ లో మంచి అనుభవంతో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్న ఇలియానాకి బాలీవుడ్ లో తను అనుకున్నది చేరు కోవడం పెద్ద కష్టమైనా విషయం కాదేమో.. త్వరలోనే ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం..