చరణ్ కి ‘ఛత్రపతి’ మహారాజ్ పడితే ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో ఉండేదా

చరణ్ కి ‘ఛత్రపతి’ మహారాజ్ పడితే ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో ఉండేదా

Published on Feb 19, 2025 6:07 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు “ఛావా”. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడిగా హైందవ ధర్మాన్ని భావితరాలకు చాటి చెప్పే యోధుని జీవిత చరిత్రగా వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఓ రేంజ్ లో చర్చ స్టార్ట్ అయ్యింది. అలాగే శంభాజీతో పాటుగా తన తండ్రి శివాజీ మహారాజ్ కోసం కూడా మళ్ళీ మనవాళ్ళు చరిత్ర తిరగరాస్తున్నారు.

అయితే ఇపుడు ఉన్న ప్రపంచంలో నిజమైన శివాజీ, శంభాజీలని మనం చూసింది లేదు. వారి ప్రతిమలు మాత్రం చూసి వారు ఇలా ఉండేవారు అని తెలుసుకున్నాం. అయితే అలంటి యోధుల జీవిత చరిత్రలపై సినిమాలు వచ్చినపుడు వారిని ఎంతగానో స్మరిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇపుడు శివాజీ మహారాజ్ జీవిత చరిత్రపై కన్నడ నటుడు రిషబ్ శెట్టితో బాలీవుడ్ సినిమా చేస్తున్నారు.

కానీ ఇదే పాత్ర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కానీ పడితే దాని ఇంపాక్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని లేటెస్ట్ మేము పెట్టిన పోల్ తో రుజువైంది. శివాజీ మహారాజ్ రోల్ లో రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని యూనానిమస్ గా భారీ మార్జిన్ తో చరణ్ ముందు వరుసలో ఉన్నాడు.

చరణ్ ఆహార్యం, తన ఆకృతి శివాజీ మహారాజ్ ని మరిపిస్తాయని ఫ్యాన్స్ కూడా పలు ఎడిట్స్ చేశారు. అలాగే న్యూట్రల్స్ కూడా ఈ పవర్ఫుల్ రోల్ కి చరణ్ సరిగ్గా సరిపోతాడు అనే అంటున్నారు. మరి ఈ సినిమా మాత్రం రామ్ చరణ్ తో పడి ఉంటే పాన్ ఇండియా బాక్సాఫీస్ మరింత షేక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు