‘ఇడ్లీ కొట్టు’కు గిరాకీ అదిరింది..!

‘ఇడ్లీ కొట్టు’కు గిరాకీ అదిరింది..!

Published on Nov 6, 2025 12:00 AM IST

Idli-Kottu

తమిళ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఇడ్లీ కడాయి’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను తెచ్చుకుంది. అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమాకు తమిళ, తెలుగు బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది.

అయితే, ఈ సినిమా ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. అయితే, ఈ సినిమాకు ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. కేవలం వారం రోజుల్లో ఈ సినిమాకు 5 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి ఈ మార్క్ చేరుకునేందుకు 11 రోజుల సమయం పట్టింది.

అలాంటిది కేవలం వారం రోజుల్లో ఈ ఫీట్ అందుకోవడంతో ఈ ‘ఇడ్లీ కొట్టు’ చిత్రానికి ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుందనే విషయం స్పష్టం అవుతోంది. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించగా అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని, షాలిని పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు