త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బన్ని-పూరి సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా డిసెంబర్ 16 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను చిత్రీకరించడానికి ఈ చిత్ర టీం త్వరలోనే ముంబై వెళ్లనుంది, అక్కడ పూర్తవగానే బ్యాంకాక్లో ఒక నెల రోజులు షూటింగ్ చేయనున్నారు. సినిమాలోని ఎక్కువభాగం న్యూజీల్యాండ్ లోని అందమైన లోకేషన్స్ లో షూట్ చేయనున్నారు. అమలా పాల్ మరియు కేథరిన్ థెరిసా బన్ని సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చాలా స్టైలిష్ గా ఉండాలని బండ్ల గణేష్, పూరి జగన్నాథ్ పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నారని ఇది వరకే తెలిపాము. అందులో భాగంగానే 60 డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అల్లు అర్జున్ కి ఒక ఫోటోషూట్ చేసారు. మాకు అందిన సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ ని ఎంతో పగడ్బందీ గా తయారు చేస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Exit mobile version