నాకు అవార్డులతో పాటుగా డబ్బు కూడా కావాలి


ఈ రోజు ఈనాడు దిన పత్రికకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ ఆయన సినిమాలకి సంభందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. మీలాంటి దర్శకుడి సినిమాలో కమర్షియల్ అంశాలు జోడించడం అవసరమా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నాకు అవార్డులతో పాటుగా డబ్బు కూడా అవసరం. విమర్శకుల ప్రశంసలు, అవార్డులులే కాదు నాకు ఆశ ఎక్కువ, నా సినిమాలకి కలెక్షన్స్ రావాలని కోరుకుంటాను. సినిమా అంటే వ్యాపారం కూడా, డబ్బు లేకుండా సినిమా చేయలేము కదా. గమ్యం లో బడ్జెట్ తో తీసిన సినిమా టార్గెట్ ఆడియెన్స్ చేరుకోగలిగింది కాబట్టి నిలబడింది. కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలకి కమర్షియల్ సక్సెస్ కూడా అవసరం. త్రివిక్రమ్ కూడా తన జులాయి సినిమాకి ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. తన డైలాగులతో పాటుగా మాస్ మసాలా అంశాలు జోడించి కమర్షియల్ గా పెద్ద హిట్ కొట్టాడు.

Exit mobile version