కాజల్ కు గుంటూర్ అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పుకొచ్చింది. ఎందుకా అని అనుకుంటున్నారా?? ఈ వూర్లోనే ఈ భామకు చాలామంది అభిమానులు వున్నారట. ఈ విషయాన్ని గుంటూర్ కు చిన్న ట్రిప్ వెళ్ళిన కాజల్ యే తెలుపడం విశేషం. మగధీర, నాయక్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు ఇక్కడ ఘనవిజయాలు సాధించాయి
“నాకు ఈ వూరు చాలా మంది అభిమానులను ఇచ్చింది. ఇంతమంది ప్రేమను పంచిన ఈ ఊరుని ఎప్పటికీ మర్చిపోలేను” అని షాప్ ఓపెనింగ్ కు వెళ్ళిన ఈ భామ మీడియా ముందు తెలిపింది
ప్రస్తుతం రామ్ చరణ్ తో కృష్ణ వంశీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ భామ తమిళంలో కూడా భారీ సినిమాలే చేస్తుంది